హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా.. నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది.
Also Read : Tollywood : టాలీవుడ్‌కు మరో లోకల్ హీరోయిన్ దొరికేసిందోచ్
పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు హీరో తేజ సజ్జా. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినపుడు చివర్లో రాముడు పాత్రకు సంబంధించి చిన్న పాటి క్లిప్ ను చూపించారు. కానీ ఆ ఫేస్ ఎవరనేది క్లారిటీగా చూపించలేదు. విశ్వసనీయ సమాచారం ఏంటంటే మిరాయ్ లో రాముడి పాత్రలో కనిపించబోయేది ఎవరో కాదు టాలీవుడ్ భల్లాల దేవ.. మన దగ్గుబాటి రానా. ఈ సినిమా కథ నచ్చడంతో తేజా సజ్జా కోసం రాముడి పాత్రలో నటించాడట రానా. సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలలో రాముడి ఎంట్రీ ఉండబోతుందని ఆడియెన్స్ కు బెస్ట్ సినిమా ఎక్స్పీరియెన్స్ నిస్తుందని టీమ్ భావిస్తోంది. అలాగే ఈ సినిమాలో మరొక సర్ప్రైజ్ కూడా ఉందట. మిరాయ్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు తేజా సజ్జా అలాగే మంచు మనోజ్. విలన్ గా తనకు స్పెషల్ ఇమేజ్ తీసుకువస్తుందని మనోజ్ నమ్మకంగా ఉన్నాడు.