లిటిల్ హార్ట్స్ రీసెంట్లీ రిలీజైన ఈ చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద మనస్సు చేసుకుని హిట్ చేశారు. మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 90స్ ఓటీటీ ఫిల్మ్స్‌తో మెప్పించిన మౌళికి ఇదే ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ కొట్టేశాడు యూత్ ఫుల్ హీరో. కానీ శివానీ నాగారంకు ఇది సెకండ్ ఫిల్మ్స్. అంతకు ముందే అంబాజీ పేట మ్యారేజ్ రూపంలో మంచి ఫెర్మామెన్స్ చూపించింది ఈ హైదరాబాదీ గర్ల్.
Also Read : Allu Shock : అల్లు అరవింద్ కు GHMC షాక్.. కూల్చేస్తాం..
షార్ట్ ఫిల్మ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన శివానీ నగరం జాతి రత్నాలులో ఓ స్మాల్ క్యారెక్టర్లలో మెరిసింది. ఆ తర్వాత అంజాబీ పేట మ్యారేజ్ బ్రాండ్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్‌లో కాత్యాయనిగా కుర్రకారు మనసు దోచేస్తోంది. అనుష్క, శివకార్తీకేయన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో పోటీగా దిగిన వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుని.. బడ్జెట్‌లో 200 పర్సెంట్ రికవరీ చేసిందని టాక్. శివానీ నాట్ ఓన్లీ యాక్టర్, మల్టీ టాలెంటర్ ఆల్సో. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ అంతే కాదు సాంగ్స్ కూడా అద్భుతంగా పాడుతోంది. ఆరంభం అనే సినిమాలో ఓ సాంగ్ పాడింది శివానీ. ఈ లెక్కన టాలీవుడ్‌కు మరో తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ దొరికేసినట్లే కనిపిస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్‌లో నయా సెన్సేషనల్ గర్ల్‌గా అవతరించిన ఈ లోకల్ గర్ల్స్ మరోసారి సుహాస్‌తో హే భగవాన్ చేస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ టూ బిజీ హీరోయిన్లుగా మారిన శ్రీ గౌరీ ప్రియా, వైష్ణవి చైతన్య సరసన నెక్ట్స్ ఈ భామ కూడా చేరుతుందేమో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందేమో లెట్స్ వెయిట్.