యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా ఈ శుక్రవారం (జాలై7న) విడుదల అయింది.నాగశౌర్య నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రంగబలి.కానీ ఈ సినిమా విడుదల అయిన మొదటిరోజు నుంచి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుంచే సినిమా పై భారీగా హైప్ ఉండటం తో టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ మూవీ భారీగానే ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లు తెలుస్తుంది.తాజాగా రంగబలి ఏ ఓటీటీ సంస్థ లో విడుదల కానున్న దానిపై క్లారిటీ అయితే వచ్చింది.ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. నాగశౌర్య కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు దాదాపు ఏడు కోట్ల రూపాయలకు ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాను థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఓటీటీలో విడుదల చేసే లా నిర్మాతల తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.. ఆగస్టు నెల రెండవ వారం లో రంగబలి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.. రంగబలి సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన యుక్తతరేజా హీరోయిన్‌గా నటించింది. సొంత ఊరిలోని రంగబలి అనే సెంటర్ కారణంగా ఓ యువకుడి ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తన ప్రేమ కోసం స్థానిక ఎమ్మెల్యేతో అతడు ఏవిధంగా పోరాటం సాగించాడన్నది ఈ సినిమా కథ.దర్శకుడు ఈ సినిమాను తను అనుకున్న విధంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో నాగశౌర్య యాక్టింగ్‌తో పాటు సత్య కామెడీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. రంగబలి సినిమను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై దసరా సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.