OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ సెన్సేషన్ సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అంగ్రీ చీతా సాంగ్ యూత్ ను ఊపేసింది. పైగా ఇందులో పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. తాజాగా పవన్ ఫ్యాన్స్ కు తమన్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ ఇచ్చాడు. తాజాగా తమన్ ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో పవన్ ఫ్యాన్స్ కోసం ఈ విషయం చెప్పుకొచ్చాడు.
Read Also : Shivarajkumar : పెద్ది సినిమాలో నా పాత్ర చాలా పవర్ ఫుల్ శివరాజ్ కుమార్
‘ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికే పూర్తి అయిపోయాయి. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని వాటిని స్పెషల్ గా చేశాం. ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాయి. ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. పవన్ కల్యాణ్ గారు త్వరలోనే సినిమా సెట్స్ కు వస్తారు. ఆయన వచ్చిన రోజు దాన్ని రిలీజ్ చేస్తాం. ప్రతి విషయం అప్డేట్ ఇస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓజీ షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. ఇంకో 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా చేసేస్తే ఈ మూవీ అయిపోతుంది. పవన్ లేని మిగతా నటీనటుల సీన్లు పూర్తి చేస్తున్నారు డైరెక్టర్.