Varisu: రంజితమే తెలుగు వర్షన్ వచ్చేస్తోంది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కదా మరి తమిళ వర్షన్ పాటని రిలీజ్ చేసి చాలా రోజులు అవుతున్నా తెలుగు వర్షన్ లో ‘రంజితమే’ పాటని ఎందుకు విడుదల చేయలేదని అంతా అయోమయంలో పడ్డారు. ఈ డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘రంజితమే’ తెలుగు వర్షన్ ని నవంబర్ 30న ఉదయం 9:09 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
తమిళ్ వెర్షన్ ‘రంజితమే’ పాటని హీరో విజయ్, సింగర్ ఎమ్.ఎమ్ మానసి పాడారు. తెలుగులో రంజితమే పాటకి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాయగా అనురాగ్ కులకర్ణీ, ఎమ్.ఎమ్ మానాసి పాడారు. ‘ఆశా పాశం’, ‘మహానటి’, ‘నీ చిత్రం చూసి’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణీ పాడడం ‘రంజితమే’ తెలుగు వర్షన్ కి కలిసొచ్చే విషయం. రంజితమే తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పడంతో, దిల్ రాజు అండ్ టీం ‘వారసుడు’ ప్రమోషన్స్ ని మొదలుపెట్టినట్లు అయ్యింది. అయితే ఈసారి నుంచి తెలుగు తమిళ వర్షన్ కి ఇంత గ్యాప్ ఉండకుండా రెండు పాటలని ఒకేసారి రిలీజ్ చేస్తే సినిమాకి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Sensational #Ranjithame Telugu from #Vaarasudu will be out on Nov 30th @ 9:09AM!🥁
🎤 @AnuragKulkarni_ & @Manasimm
✍️ @RamjoWrites#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #BhushanKumar #KrishanKumar #ShivChanana @SVC_official @PVPCinema @TSeries pic.twitter.com/HapB28BBrh— Sri Venkateswara Creations (@SVC_official) November 29, 2022
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!