దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు/వారిసు’. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. ముందు జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాకి పోటీగా వారసుడు సినిమా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరేలే కోలీవుడ్ లో కూడా అజిత్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది కదా, ఆ మూవీకి వారసుడుకి మధ్య ఒక్క రోజు అయినా గ్యాప్ ఉందిలే అని అంతా అనుకున్నారు. ఏమయ్యిందో తెలియదు కానీ దిల్ రాజు సడన్ గా వారసుడు సినిమాని అజిత్ ‘తునివు’ రిలీజ్ రోజునే విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. జనవరి 11న, ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు. దిల్ రాజు ముందు చెప్పిన 12నే వారసుడు సినిమాని రిలీజ్ చెయ్యకుండా ప్రీపోన్ చేసుకోని మరీ జనవరి 11న ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు. ఈ పోటీ రెండు సినిమాల ఓపెనింగ్స్ కి మంచిది కాదు అని అందరూ అనుకున్నారు. ఎవరు ఏమనుకున్నా తన సినిమాని జనవరి 11నే రిలీజ్ చేస్తాను అని క్లారిటీగా దిల్ రాజు చెప్పేయడంతో ఒక భారి బాక్సాఫీస్ ఫైట్ చూడబోతున్నాం అని కోలీవుడ్ వర్గాలు ఫిక్స్ అయ్యాయి.
ఇదే సమయంలో వీరసింహారెడ్డికి సోలో రిలీజ్ దొరికేసిందిలే అని రిలాక్స్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. కొన్ని ఏరియాల్లో తెలుగు సినిమాల కన్నా వారసుడు సినిమాకి ఎక్కువ థియేటర్స్ ని కేటాయించేలా చేసిన దిల్ రాజు, ఇప్పుడు తన ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. వారసుడు మూవీని తమిళ్ లో జనవరి 11నే రిలీజ్ చేసి, తెలుగు డబ్బింగ్ వర్షన్ ని మాత్రం రెండు మూడు రోజులు ఆగి రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడు అనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. డబ్బింగ్ వర్షన్ కి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టే వారసుడు సినిమా తెలుగులో చెప్పిన డేట్ కి రిలీజ్ కావట్లేదు అనే వాళ్లు కొంతమంది ఉంటే దిల్ రాజు తన సినిమా విషయంలో అలా చెయ్యడు, ఎక్కడో ఎదో జరిగింది అందుకే తెలుగు వర్షన్ రిలీజ్ మాత్రమే వాయిదా వేస్తున్నాడు అంటున్నారు. ఏది ఏమైనా వారసుడు సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు కాబట్టి ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ చాలా వరకూ క్యాన్సిల్ అవుతున్నాయి. ప్రీసేల్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగట్లేదు, సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ డేట్ క్లారిటీ లేని సినిమాకి ఎక్కువ థియేటర్స్ ని కేటాయించడం కూడా కష్టమవుతుంది. మరి దిల్ రాజు వారసుడు సినిమాను ఈ వారమే విడుదల అని కాకుండా ఒక రిలీజ్ డేట్ ని లాక్ చేసి అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.