సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే సమయానికి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేయడానికి రానుంది ‘లియో’ సినిమా. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న లియో మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా అంతా లియో సినిమా సాలిడ్ సౌండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి నెల రోజుల ముందే ఇప్పుడే సోషల్ మీడియాలి #Leo ట్యాగ్ కబ్జా చేసి లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసేలా చేస్తుంది. #Leo #LeoUpdate #LeoSecondSingle టాగ్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సైమా స్టేజ్ పైన ‘బెస్ట్ డైరెక్టర్ తమిళ్’గా అవార్డ్ అందుకున్నాడు.
ఈ స్టేజ్ పైన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ… “లియో సినిమా ప్రమోషన్స్ సరిగ్గా నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నాం… అంటే మరో 24 గంటల్లో లియో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతాయి” అని చెప్పాడు. లోకేష్ చెప్పిన టైమ్ ప్రకారం కాసేపట్లో లియో నుంచి అప్డేట్ బయటకి రానుంది. సెకండ్ సాంగ్ కి సంబందించిన అనౌన్స్మెంట్ బయటకి రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే లియో సినిమా నుంచి వచ్చిన ‘నా రెడీ’ సాంగ్ ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక సెకండ్ సాంగ్ కూడా బయటకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటే లియో సినిమా ప్రమోషన్స్ కి సూపర్ ఎనర్జీ వచ్చినట్లే. ఈ ప్రమోషన్స్ హైప్ ఎక్కువ అయ్యి ఫెస్టివల్ సీజన్, లాంగ్ వెకేషన్ కూడా కలిసొచ్చి లియో సినిమా కోలీవుడ్ లో ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.