Pooja Hegde: విజయ్ గురించి పూజా హెగ్డే ఇంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసిందబ్బా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటారు. రెండేళ్ల క్రితం ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడి ఘన విజయాన్ని అందుకుంది. ఈ అద్భుత విజయంతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే, విజయ్ ఈ స్థాయి విజయం సాధిస్తారని హీరోయిన్ పూజా హెగ్డే ముందే ఊహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘జన నాయగన్’ చిత్ర షూటింగ్ సమయంలో.. “ఎవరు గెలుస్తారు?” అన్న ప్రశ్నకు పూజా ఏమాత్రం తడబడకుండా విజయ్ వైపు చూపిస్తూ “ఈయనే గెలుస్తారు” అని చెప్పారు. అప్పుడు సరదాగా సాగిన ఆ సంభాషణ, నేడు అక్షరాలా నిజం కావడంతో పూజా హెగ్డే సంతోషం వ్యక్తం చేశారు. “విజయ్ సార్ సీఎం అవుతారని నేను ముందే ఊహించాను.. మీ కలలు నిజం కావాలి” అంటూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read
మరోవైపు విజయ్ అభిమానులు కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలికితీశారు. గతంలో ఆయన నటించిన ‘GOAT’ సినిమాలో ఒక కారు నెంబర్ ప్లేట్ మీద “TN 07 CM 2026” అని ఉంటుంది. యాదృచ్ఛికంగా ఆ నెంబర్ ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు విజయ్ సినిమాలకు స్వస్తి పలకడం ఫ్యాన్స్‌ను కొంత బాధకు గురిచేసినా, ప్రజాక్షేత్రంలో ఆయన ‘జన నాయగన్’గా ఎదగడం పట్ల అంతా గర్వపడుతున్నారు. సినిమాల్లో దళపతిగా అలరించిన విజయ్, ఇప్పుడు ఒక రాష్ట్రానికే నాయకుడిగా ఎదిగి సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx
— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026
తాజావార్తలు
-
RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
-
Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?