నేషనల్ క్రాష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇది కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాగా వేయడానికి అక్కడే రెండు సినిమాలు చేసేస్తుంది. మరోపక్క మరో పాన్ ఇండియా సినిమాలోనూ అమ్మడు నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించనున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రష్మికను ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టారట. ఇక ఆమె ప్లేస్ లో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే విజయ్ కూడా కృతి సనన్ ని ఒకే చేయడంతో రష్మికను సైడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.