TG Vishwa Prasad: ప్రొడక్షన్ హౌస్ లో అవినీతి.. నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Vishwa Prasad: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ సంస్థను మొదలుపెట్టి మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రానుంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ప్రొడక్షన్ హౌస్ లో జరిగే అవినీతి గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటుందో.. దాన్ని అరికట్టడానికి విశ్వప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్ని క్లారిటీ గా చెప్పుకొచ్చాడు. అయితే అయన మాటలను ఇండస్ట్రీలో కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ విషయమై విశ్వప్రసాద్ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు.
“మా ఈగల్ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా, నేను నా ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటోందో చెప్పాను.. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి ప్రతిచర్యలు చేపట్టాను అని మీడియా వారికి చెప్పడం జరిగింది. దీనికి భుజాలు తడుముకున్న కొందరు పరిశ్రమ వ్యక్తులు, నా వ్యాఖ్యలు వక్రీకరించి, నేనేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల, కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేనన్నాను.. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకర్ధం కాలేదు. నా సంస్థలో ఎవరికైనా జీతాలందకపోతే, వారు నేరుగా మాట్లాడి తీసుకుంటారు. యూనియన్ కి కంప్లైంట్ వస్తే ఛాంబర్ లో లేదా కౌన్సిల్ లో సాల్వ్ చేసుకుంటాం. ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కంపెనీ లో అవినీతి కి పాల్పడని వారంతా గర్వంగా పనిచేయవచ్చు.. అవినీతి పరులపై నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నేను వారి కుటుంబాల గురించి ఆలోచించి వారిని వదిలేశాను. అది నా స్వంత నిర్ణయం.. బయటి వారికి సంబంధం లేదు..నేను తీసిన ముప్ఫైకి పైగా సినిమాల్లో మూడు లక్షలకు పైగా కార్మిక సోదరుల కష్టం ఉంది.. మరో పాతిక సినిమాలు సెట్ మీదకొస్తున్నాయి. నేను యూనియన్ వర్కర్స్ కి వ్యతిరేకం కాదు.
వాళ్ల కష్టాన్ని, నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే.. నేను ఏ అవినీతిపరుడికి లొంగిపోను.. నిజాయితీ ప్రబలుతుంది.. సినిమా కన్నా ఏ వ్యక్తి పెద్దది కాదు” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
మా ఈగల్ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా, నేను నా ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటోందో చెప్పాను.. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి ప్రతిచర్యలు చేపట్టాను అని మీడియా వారికి చెప్పడం జరిగింది.
దీనికి…
— Vishwa Prasad (@vishwaprasadtg) February 8, 2024
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?