జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణ లీక్ అయింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ధనుని ప్రశ్నించిన ఎమ్మెల్యే. నేను అనంతపురం ఎమ్మెల్యే వార్ 2 సినిమా ఆడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాయి.
ఈ వ్యవహారంపై అనంతపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే ప్రసాద్ బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేసారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. బాద్యయుతమైన పదవిలో ఉండి నీచమైన వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుండాలి. ఎమ్మెల్యే చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకొని, మా హీరోకు బహిరంగంగా క్షమాపనలు చెప్పాలి అని ధర్నా చేస్తున్నారు.
ఎమ్మెల్యే క్షమాపణలు : జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వీడియో మాట్లాడుతూ ‘ ఆ ఆడియో కాల్స్ నావి కాదు. రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే.. నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఈ క్షమాపణలు చెబుతున్నాను. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడునే’ అని అన్నారు.