తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ వెనుదిరిగారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మనోజ్, ఆయన సతీమణి మౌనిక హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. తర్వాత రంగంపేట వచ్చి జల్లికట్టు వీక్షించారు.
అనంతరం మోహన్ బాబు స్కూల్ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. పలు వాహనాల్లో 50-60 మంది అనుచరులు వారిని అనుసరించారు. అంతకుముందే అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు, క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద మోహరించి, మనోజ్ ను అడ్డుకున్నారు. తనకు కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులూ అందలే దని చెప్పడంతో పోలీసులు జిరాక్స్ ప్రతిని అందజేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించా లని వారు నచ్చజెప్పడంతో అంగీకరించిన మనోజ్ గేటు వద్ద బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ‘ఎంతమంది బౌన్సర్లను పంపుతారో పంపండి నేను ఒక్క డిని చాలు వారికి సమాధానం చెప్పడానికి’ అంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయల్దేరి పక్కనే ఉన్న కాలేజీ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వెళుతుండగా విష్ణు అనుచ రులుగా భావిస్తున్న యువకుల బృందంలో ఒకరు కర్రతో మనోజ్ వాహనంపై బాదారు. కాగా, కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్లు ఎంబీయూ మీడియా ఇన్చార్జ్ రవి చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు