Rathika safe – Bhole eliminated in 10th Week: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ప్రేక్షకులు అస్సలు ఆలోచించలేని ఎన్నో పరిణామాలు జరుగుతున్న క్రమంలో భారీ స్పందన అందుకుని ముందుకు వెళ్తోంది. ఈ సీజన్‌లో మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్, తొమ్మిదో వారంలో టేస్టీ తేజలు ఎలిమినేట్ అయిపోయాగా 10 వారంలో తక్కువ మందే నామినేట్ అయ్యారు. చివరిగా నామినేషన్ టాస్కులో మొత్తంగా భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శివాజి, గౌతమ్ కృష్ణలు నామినేషన్‌లోకి వచ్చారు.
Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..
ఇక ఈ వారం అన్ని లెక్కలు వేసుకున్నాక రతిక ఈ వారం పెట్టే బేడా సర్దేయడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ బిగ్ బాస్ తెలుగు 7లో, రతిక రోజ్ సేఫ్ అని షాకింగ్‌గా, భోలే షావలి 10వ వారంలో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. రతిక రీ-ఎంట్రీ తర్వాత గేమ్‌ప్లే చూసిన తర్వాత, చాలా మంది ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం, ఈ వారం కూడా రతిక సేఫ్ గా ఉంది. అనధికారిక పోల్స్‌లో ఆమె రెండవ చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం, ఇక ఈ వారం భోలేకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి, అయితే ఇద్దరి మధ్య తేడా చాలా తక్కువ అని అంటున్నారు. కాబట్టి, తక్కువ ఓట్లు రావడంతో, భోలే ఎలిమినేట్ అయినట్లు చెప్పబడింది. శివాజీ హౌస్‌కి కొత్త కెప్టెన్ అయ్యాడని కూడా అంటున్నారు. చూడాలి రేపు ఇందులో ఎంతవరకు నిజం అవుతుంది అనేది.