Telugu Indian Idol: ఎలిమినేట్ అయిన ఆ ఇద్దరూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు పాటకు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేజ్ గా నిలిచింది ఆహాలోని తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమం. ఈ శుక్ర, శనివారాల్లో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడంతో ఇప్పుడు రేస్ టూ ఫినాలేలో ఆరుగురు సింగర్స్ నిలిచారు. జూన్ 3వ తేదీ జనం ముందుకు రాబోతున్న ‘మేజర్’ చిత్రం హీరో అడివి శేష్, అందులో కీ రోల్ ప్లే చేసిన శోభిత దూళిపాళ శుక్రవారం ప్రసారమైన కార్యక్రమంలో పాల్గొన్నారు.
శుక్రవారం నాటి 27వ ఎపిసోడ్ సరదాగా మొదలైంది. శ్రీరామ్ చంద్ర కాకుండా షో కార్తీక్ వ్యాఖ్యానంతో మొదలైంది. సరదాగా కార్యక్రమాన్ని అచ్చ తెలుగులో మొదలు పెట్టిన కార్తీక్ అందరి మనసులు గెలుచుకున్నాడు. నిత్యామీనన్ అయితే… ‘కార్తీక్ కు తెలుగు మాట్లాడటం సరిగా రాదని అన్నది ఎవరు?’ అంటూ ప్రశ్నించింది. ఇక షోకు అతిథులుగా వచ్చిన అడివి శేష్… తాను వైష్ణవికి బిగ్ ఫ్యాన్ అని ముందే చెప్పేశాడు. పిన్నవయసులోనే సింగర్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకుంటున్న వైష్ణవిని అభినందించాడు. ఆ తర్వాత వాగ్దేవి ‘పంజా’ సినిమాలోని ‘వెయ్ ర చెయ్ వేయ్ రా’ గీతంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి పాటకే జడ్జెస్ బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడివి శేష్ ను తమన్ ‘ఫర్హాన్ అక్తర్ ఆఫ్ ది టాలీవుడ్’ అంటూ సంభోదించాడు.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
సన్నీ లియోన్ కు అడివి శేష్ కు మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటీ?
ఈ వేదికపై ‘మాయాబజార్’లోని ప్రియదర్శిని తరహా పెట్టెను తీసుకొచ్చి పెట్టారు. అందులో ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే ఛాయా చిత్రం ఉంది. అడివి శేష్ ఆ పెట్టెను తెరవగానే సన్నీ లియోన్ ఫోటో కనిపించింది. అయితే దానికి వెనుకో కథ ఉందని శేష్ చెప్పాడు. అతని తండ్రి అప్పట్లో క్రికెటర్ సునీల్ గవాస్కర్ కు పెద్ద ఫ్యాన్ అట. గవాస్కర్ ను అందరూ ముద్దుగా సన్నీ అని పిలిచే వారు. అందుకే ఆయన తన కొడుకుకు అడివి శేష్ సన్నీ చంద్ర అని పెట్టారు. అతను స్కూల్ డేస్ కు వచ్చేసరికీ సన్నీలియోన్ పాపులర్ పోర్న్ యాక్ట్రస్ గా పేరు తెచ్చుకుంది. దాంతో శేష్ ను ఆటపట్టిస్తూ స్నేహితులంతా సన్నీ లియోన్ అని పిలిచే వారట. మొత్తానికి ఈ వేదికపై శేష్ తన పూర్తి పేరు, దాని వెనుక ఉన్న కథను తెలిపాడు.
సెకండ్ కంటెస్టెంట్ గా వచ్చిన రేణు కుమార్ ‘దళపతి’ మూవీలోని ‘సింగారాల పైరుల్లోన…’ గీతాన్ని పాడాడు. అతని పెర్ఫార్మెన్స్ ను అంతా మెచ్చుకున్నారు. బాలు, యేసుదాసు వంటి ఇద్దరు లెజండరీ సింగర్స్ పాడిన పాటను అతి సులువుగా రేణు పాడాడంటూ అభినందించారు. ఆ తర్వాత ‘మేజర్’ నుండి విడుదలైన తాజా గీతాన్ని జయంత్ ఆలపించాడు. ఆ పాటను మూవీ లైన్ ప్రొడ్యూసర్ రాజీవ్ భరద్వాజ్ రాశాడని చెప్పిన అడవి శేష్, జయంత్ ఆ పాటను ఆర్మాన్ కి మ్యాచ్ అయ్యేలా పాడడని అభినందించాడు. జయంత్ సరైన పిచ్ లో పాడి పిచ్చెక్కించాడని తమన్ కితాబిచ్చాడు. నటి శోభితతో కలిసి డాన్స్ చేయాలని ఉందని జయంత్ కోరడంతో ఆమె అంగీకరించింది. ఈ సందర్భంగా శోభితకు జయంత్ బాగానే బిస్కెట్స్ వేశాడు. ‘తెలుగు అందంగా మాట్లాడేవారిని తాను చూశానని, కానీ అందమే తెలుగును మాట్లాడటం ఇప్పుడే చూస్తున్నాన’ని శోభితను ఉద్దేశించి జయంత్ అనడంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత వైష్ణవి ‘ఖడ్గం’ మూవీలోని ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ పాటను పాడింది. ఆమె గాత్రానికి ఫిదా అయిన శేష్, ఆమెతో కలిసి స్టేజ్ మీద స్టెప్పులేశాడు. వైష్ణవి పాటకూ జడ్జెస్ బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేశారు. వైష్ణవి టాలెంట్ వెనుక డెవిల్, మాన్ స్టర్ లాంటి గురువు కల్పన ఉండటం విశేషమని అన్నారు తమన్.
శ్రీనివాస్ ధరిమిశెట్టి ఈజ్ బ్యాక్!
శనివారం ఎలిమినేషన్ రౌండ్ కావడంతో కార్యక్రమం కాస్తంత గంభీరంగా మొదలైంది. మొదటగా ప్రణతి ‘ఒకే బంగారం’లోని ‘మన మన మెంటల్ మదిలో…’ పాటను పాడింది. నిత్యామీనన్ కోసమే ఆ సినిమాను ఎనిమిది సార్లు చూశానని ప్రణతి చెప్పడంతో ఫిదా అయిన నిత్యామీనన్ ఆమెతో కలిసి గొంతు కలపడానికి వేదిక పైకి వెళ్ళింది. ఆ తర్వాత శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘సాగర సంగమం’లోని ‘వేదం… అణువణువున నాదం’ గీతాన్ని అద్భుతంగా పాడాడు. శ్రీనివాస్ ఈ పాటతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చాడని న్యాయనిర్ణేతలంతా కితాబిచ్చారు. అతన్ని సర్ ప్రైజ్ చేస్తూ, శ్రీనివాస్ కాబోయే శ్రీమతి, గర్ల్ ఫ్రెండ్ శిల్పను వేదిక మీదకు నిత్యా మీనన్ ప్రవేశ పెట్టింది. కంగారు పడకుండా, కాన్ఫిడెంట్ గా పాడమంటూ శ్రీనివాస్ కు శిల్ప ధైర్యాన్ని ఇచ్చింది. తమ పెళ్ళికి పెద్దలు సైతం అంగీకరించారని, తెలుగు ఇండియన్ ఐడిల్ క్రూ మొత్తం వివాహానికి హాజరు కావాలని శిల్ప కోరింది. శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ తరహాలో ఉందని జడ్జీలు చెప్పారు. ఆ తర్వాత ఈ పాటను కార్తీక్, శ్రీరామచంద్ర కలిసి అద్భుతంగా మరోసారి పాడారు. ఆ తర్వాత అదితి భావరాజు ‘ఓ పాపా లాలి’ చిత్రంలోని బాలు గీతం ‘మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు’ గీతాన్ని ఆలపించింది. బాలు పాడిన పాటను ఆమె పాడటం తనకంతగా నచ్చలేదని తమన్ చెప్పాడు. నిత్యా మీనన్, కార్తీక్ మాత్రం ఆమె చక్కని ప్రయోగం చేసిందని అభినందించారు. శనివారం చివరగా లాలస ‘దేవిపుత్రుడు’ సినిమాలోని ‘ఆకాశంలోని చందమామ… బంగారు పాపై వచ్చెనమ్మా’ గీతాన్ని పాడింది. ఆమె పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన జడ్జీలు బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఇక ఈ వారం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ శ్రీనివాస్ కు దక్కింది.
బాలకృష్ణకు పాట పాడబోతున్న రేణు కుమార్!
మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లో లాస్ట్ మూడు స్థానాల్లోనూ అదితి, వైష్ణవి, రేణు మిగిలారు. అయితే పాయింట్ ఫైవ్ డిఫరెన్స్ తో ప్రణతి ఐదో స్థానంలో నిలిచి సేవ్ అయిపోయింది. ఈ చివరి ముగ్గురిలో అదితి, రేణు ఎలిమినేట్ అయినట్టు శ్రీరామచంద్ర తెలిపాడు. అయితే రేణుకు మాత్రం ఓ బంపర్ ఆఫర్ తగిలింది. తమన్ సంగీతం అందిస్తున్న బాలకృష్ణ చిత్రంలో రేణు కుమార్ కు పాట పాడే అవకాశాన్ని తాను కల్పిస్తున్నట్టుగా తమన్ చెప్పాడు. చిత్ర బృందం కూడా అందుకు అంగీకరించారని అన్నాడు. అలా రేణు షో నుండి ఎలిమినేట్ అయినా… నందమూరి బాలకృష్ణకు పాట పాడే గొప్ప ఛాన్స్ ను దక్కించుకున్నాడు.
తాజావార్తలు
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?