తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్‌తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇకనుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, లక్ష్మీ నివాసం, మేఘసందేశం, జయం, చామంతి సీరియల్స్ ఇకనుంచి ఆదివారం…
జీ తెలుగు సీరియల్స్ సీతే రాముడి కట్నం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులతోపాటు ఇతర తారలు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ పేరున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమం ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ తెలుగు ఇటీవల సిరిసిల్లలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని…