Malla Reddy is going to start a Movie Production House: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి చాలా ఫేమస్, ఆయన ఒకప్పుడు జంపింగ్ జపాంగ్ నేతగానే అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన ఫేమస్ అయి తన పంచులతో అలరించటంలో మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఆరితేరిపోయారు. అయితే పాలమ్మిన, పూలమ్మిన, బోర్ వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా అని మంత్రి మల్లారెడ్డి ఆ మధ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మల్లారెడ్డి సీరియస్ గా సాగే అసెంబ్లీలో కూడా తనదైన మాటలతో ఎమ్మెల్యేల్ని నవ్విస్తూ ఉంటూ పొలిటీషియన్ గా తనకంటూ సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న మల్లారెడ్డి సినిమా నిర్మాణం వైపు కూడా అడుగులేస్తున్నారు. నిజానికి ఈ ఈ విషయాన్ని ఆయన స్వయంగా చాలా కాలం క్రితమే ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
TG Vishwa Prasad: అంబటి రాంబాబువి గాలి మాటలు.. నేను సీరియస్ గా తీసుకుంటే ఎలా బుద్ది చెప్పాలో తెలుసు
ఆ మధ్య తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగిన క్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా తర్వాత ఓటీటీకి విపరీతంగా ఆదరణ పెరిగిందని.. తానూ కూడా ఓటీటీ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేస్తానని కామెంట్ చేశారు. అంతేకాదు మల్లారెడ్డి తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తానని కూడా అన్నారు. మీతో కలిసి కార్మికుల కోసం ఒక సినిమా చేస్తానన్నా అని అప్పుడు మల్లారెడ్డి కామెంట్ చేస్తే చిరంజీవి కూడా అప్పుడు ఓకే అనేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఒక ఏడాది వ్యవధిలో ఆయన నలుగు సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నాలుగు సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ స్లాంగ్ లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ అంశం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.