Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు” అని మంత్రి కొండా సురేఖ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె పేర్కొన్నారు.
Also Read :Rajamouli : రాజమౌళిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోండయ్యా..
Also Read
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
తన వ్యాఖ్యల కారణంగా వారికి ఏదైనా అవాంఛిత అభిప్రాయం కలిగి ఉంటే అందుకు చింతిస్తున్నానని, తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. నిజానికి, నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, ఆమె వెంటనే స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. ఎప్పుడో నాగార్జున కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చాలా కాలం తర్వాత ఇలా స్పందించడం గమనార్హం. ఈ అంశం మీద నాగార్జున ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్లారు. ఇక ఈ ట్వీట్‌తో ఈ వివాదం సద్దుమణగవచ్చని భావిస్తున్నారు.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!