గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు” అని మంత్రి కొండా సురేఖ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా…