OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ ప్రీమియర్స్ కోసం చాలా మంది టికెట్లను కొనుక్కుని వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్లకు మూవీ టీమ్ రీఫండ్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Priya Shetty : ఇందుకే బిగ్ బాస్ కు వద్దన్నాం.. ప్రియాశెట్టి పేరెంట్స్ ఎమోషనల్
ఇక ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాటు సెకండ్ షోలకు చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. వాళ్లు పేమెంట్స్ కూడా చేసేశారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి. వాళ్లంతా పెంచిన రేట్లు చెల్లించారు కదా. ఇప్పుడు తగ్గించిన రేట్లకు వాళ్లకు టికెట్లు అందించి మిగతా అమౌంట్ వాపస్ ఇస్తారా.. లేదంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినవాటికి సంబంధం లేదు అంటారా అనేది తెలియాలి. పవన్ కల్యాణ్ సినిమాకు ఇలాంటి షాక్ తగలడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. రేట్లు తగ్గిస్తే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ సినిమా హిట్ అయితే కలెక్షన్లకు ఢోకా ఉండకపోవచ్చు.
Read Also : Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
