Tejaswini Madivada: తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత చెల్లెలిగా మెప్పించిన తేజు వర్మ తెరకెకెక్కించిన ఐస్ క్రీమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఇక బిగ్ బాస్ షో నుంచి తిరిగి వచ్చాక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ కమిట్మెంట్ చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న తేజు.. తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టింది. తనను ఎంతోమంది కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చింది.
“నేను సినిమాలు చేస్తూనే ఈవెంట్స్ కూడా వెళ్లేదాన్ని.. అక్కడ చాలామంది ఫుల్లుగా తాగి నా చుట్టూ చేరి నన్ను వేధించేవారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు అనేది నిజం. నన్ను చాలా మంది అడిగారు. కొందరు డైరెక్ట్ గా అడిగితే.. మరికొందరు స్నేహం పేరుతో మాట్లాడి, ఫోన్ లో అడిగేవారు. ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అమ్మాయిలకు ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. వారిపై దైర్యంగా పోరాడాలి. వారికి లొంగిపోయి ఆ తరువాత మోసపోయాం అని చెప్పడం పద్దతి కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తేజస్వి తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సమంత తనకు హెల్ప్ చేసిందని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. సామ్ కు ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా చెప్పుకురావడంతో వీరిద్దరి మధ్య అక్కాచెల్లెళ్ల బంధం ఇంకా కొనసాగుతుందని సమాచారం.