ఈ ఏడాది టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ ఒకటి. హనుమాన్ తర్వాత వరుసగా తేజ సజ్జాకు మరో బ్లాక్‌బస్టర్ దక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి, ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లు సాధించింది. దీంతో ప్రభాస్, ఎన్టీఆర్‌లతో పాటు ఓవర్సీస్‌లో 3 మిలియన్ క్లబ్ చేరిన కొద్దిమంది తెలుగు హీరోల్లో తేజ సజ్జా కూడా స్థానం సంపాదించారు.
Also Read: Rukmini Vasant : కాంతార, సప్తసాగరదాచే ఎల్లో.. రుక్మిణి వసంత్ కెరీర్ మైలురాయిలు
ఇప్పటికే నాల్గవ వారంలోకి అడుగుపెట్టిన మిరాయ్, దసరా సీజన్‌లో రిలీజ్ అయిన ఓజీ, కాంతారా చాప్టర్ 1 వంటి పెద్ద సినిమాల కారణంగా థియేటర్లలో రన్ కొంచెం నెమ్మదించింది. ఈ క్రమంలోనే మేకర్స్ త్వరగా ఓటీటీ రిలీజ్‌ను ప్లాన్ చేశారు. తాజాగా జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.. ‘మిరాయ్’ అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని తెలిపింది. అంతే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి వస్తుంది. అయితే హిందీ వెర్షన్ విడుదల పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఉత్తర భారతదేశంలో ఉన్న మల్టీప్లెక్స్ ఒప్పందాల ప్రకారం హిందీ సినిమాలు సాధారణంగా 56 రోజుల (8 వారాల) తర్వాతే ఓటీటీలోకి వస్తాయి.
Nine scriptures. Infinite power. One Superyodha to protect the Brahmand. 🪐#Mirai , India’s own superhero, is coming to your home, Streaming from October 10.#MiraiOnJioHotstar@tejasajja123 @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/WIi5rq99m0
— JioHotstar Telugu (@JioHotstarTel_) October 4, 2025