Teja Sajja : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మ్యాజిక్ చేసింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. భారీ వీఎఫ్ ఎక్స్, మైథలాజికల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ గురించి మూవీ టీమ్ చెప్పకుండా దాచిపెట్టింది. థియేటర్లలో ప్రభాస్ వాయిస్ వినగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల ఖుషీ అయిపోయారు. మూవీ భారీ హిట్ కొట్టేయడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో తేజ ప్రభాస్ గురించి మాట్లాడారు.
Read Also : Manchu Lakshmi అవన్నీ ఫేక్.. బెట్టింగ్ యాప్ కేసుపై మంచు లక్ష్మీ రియాక్ట్..
కుర్రాళ్లను ఎంకరేజ్ చేయడంతో ఎప్పుడూ ముందుండే ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్. ఒక్కసారి అడగ్గానే ఆయన ఈ సాయం చేసిపెట్టారు. ఆయనకు చాలా స్పెషల్ థాంక్స్. నిర్మాత గారు ఎప్పుడు తీసుకెళ్తారో.. ఆయన్ను పర్సనల్ గా కలిసి థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాయిస్ ఓవర్ వల్లే మూవీ కథకు అంత బలమైన వెయిట్ వచ్చింది అని తెలిపాడు తేజసజ్జా. ఈ కామెంట్స్ క్షణాల్లోనే వైరల్ అయిపోయాయి. ప్రభాస్ ఇంతకు ముందు కన్నప్ప సినిమా కోసం గెస్ట్ రోల్ చేశాడు. ఆ మూవీ ప్రభాస్ వల్లే అంతో ఇంతో కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు మిరాయ్ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఉండటంతో.. పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీకి ఫుల్ సపోర్ట్ చేసేస్తున్నారు. అసలే ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలను దాటిపోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ చిన్న వాయిస్ ఓవర్ ఇస్తే మిరాయ్ కు బలమైన వెయిట్ తీసుకొచ్చింది.
Read Also : Venkaiah Naidu : బ్రహ్మానందం కనిపిస్తేనే నవ్వొస్తుంది.. ఆత్మకథ పుస్తకం ఆవిష్కరించిన వెంకయ్య..
