Manchu Lakshmi : మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కున్న విషయం తెలిసిందే. దానిపై ఆమె స్పందించకపోవడంతో చాలా రకాల రూమర్లు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు స్పందించింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. అసలు నేను విచారణ ఎదుర్కున్న విషయం ఒకటి అయితే.. మీడియాలో వచ్చిన వార్తలు ఒకటి. ఆ వార్తలన్నీ ఫేక్. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని వాళ్లు విచారణ చేయాలనుకుంటున్నారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. ఎవరికి వెళ్తుంది.. ఉగ్రవాదులకు ఏమైనా వెళ్తుందా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ యాప్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయనేది వాల్లు ఎంక్వయిరీ చేస్తున్నారు.
Read Also : Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
మన తెలుగు రాష్ట్రాల్లో వంద మంది దాకా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని ఈడీ అధికారులు చెప్పారు. అందులో నా పేరు కూడా ఉందన్నారు. బాధ్యత గల పౌరురాలిగా నేను వెళ్లాను. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత నష్టం జరుగుతుందనే విషయం నాకు ముందు తెలియదు. తెలిసిన వెంటనే నేను ఆపేశాను. ఆ విషయంలో సారీ కూడా చెప్పాను. అయినా సరే మీడియాలో నన్ను రకరకాలుగా నిందించారు. అవన్నీ చూసి నాకు బాధేసింది. మీడియాలో నాపై వచ్చినవి ఏవీ నిజం కాదు. అవన్నీ ఫేక్ అంటూ ఎమోషనల్ అయింది మంచు లక్ష్మీ. ఈడీ విచారణలో చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ మంచులక్ష్మీ ఇన్ని రోజులకు నోరు విప్పింది.
Read Also : Mirai : బాహుబలి తర్వాత మిరాయ్ సినిమానే.. ఆర్జీవీ సంచలనం..