Buchhibabu Sana: సుకుమార్ శిష్యుడిగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా. మైత్రీ మూవీ మేకర్స్.. బుచ్చిబాబు కన్నా సుకుమార్ శిష్యుడునే ఎక్కువ గా నమ్మారు. ఉప్పెన.. సెన్సిటివ్ కథ అయినా.. ఎక్కడ అయినా బోల్తా కొట్టింది అంటే.. విమర్శలు వెల్లువెత్తుతాయని వారికి తెలుసు. అయినా కూడా బుచ్చిబాబు మీద ఉన్న నమ్మకంతో ఉప్పెనను రిలీజ్ చేసారు. మునుపెన్నడు చూడని కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బుచ్చిబాబు పై పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఇక ఈ మధ్యనే ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావడంతో డైరెక్టర్ పై మరింత నమ్మకం కుదిరింది. ఇక బుచ్చిబాబు కెరీర్ మొదలయ్యింది ఉప్పెనతో అయినా.. ఆయన దశ తిరిగింది మాత్రం రామ్ చరణ్ తోనే అని చెప్పాలి. ఉప్పెన సినిమా తరువాత దాదాపు రెండేళ్లు.. బుచ్చిబాబు.. ఎన్టీఆర్ కోసం ఎదురుచూశాడు. తారక్ కోసం కథను రాసుకొని తిరిగాడు. కానీ, తారక్ కు డేట్స్ అడ్జస్ట్ కాకానో.. కథ నచ్చకనో.. బుచ్చిబాబు సినిమా క్యాన్సిల్ అయ్యింది.
Srikanth: స్టేజిపై చెప్పులు వస్తాయి.. థమన్ ను ఇంతలా అవమానిస్తావా.. బ్రో ?
ఇక ఆ తరువాత ఒక స్పోర్ట్స్ కథను బుచ్చిబాబు.. చరణ్ కు వినిపించడం.. అది నచ్చడంతో మెగా కాంపౌండ్ లో మరోసారి అడుగుపెట్టాడు. RC16 గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాపైనే బుచ్చిబాబు కెరీర్ ఆధారపడి ఉంది. ఇక తాజాగా బుచ్చిబాబు.. RC16 కోసం కొత్త ఆఫీస్ ను కూడా తెరిచాడు. నేడు చిత్ర బృందం కొత్త కార్యాలయాన్ని పూజతో ప్రారంభించి.. ఓపెన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో బుచ్చిబాబు.. చరణ్ సినిమాతో నీ దశ తిరిగిందయ్యా.. అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో మొదటి సినిమా కన్నా పెద్ద సక్సెస్ ను ఇస్తాడా.. ? లేక మొదటి సినిమా పేరుతోనే ఇంకా ఉంటాడా అనేది చూడాలి.