Neethone nenu: టీచర్స్ డే స్పెషల్..‘గురుః బ్రహ్మ గురుః విష్ణు’ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher’s day special song from Neethone nenu Released:‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కుతోంది. శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘నీతోనే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షూట్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఉపాధ్యాయులని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు, అలాంటి వారికి అంకితమిచ్చేలా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు’ పాటను డిజైన్ చేశారు. ప్రముఖ సింగర్ మనో పాడిన ఈ పాటను స్టార్ రైటర్ సుద్ధాల అశోక్ తేజ రచించారు.
Health Tip: మందు తాగుతారా? అయితే ఈ కూరగాయ రసం తాగండి అంతా సెట్ అయిపోతుంది
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
ఇక సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలని, టీచర్స్ వల్లే అది సాధ్యమవుతుందని అన్నారు. అలాంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా మా సినిమాలో ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాట ఉందని అన్నారు. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను, రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్ ఆ సిస్టంలోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ‘నీతోనే నేను’ అని అన్నారు. డైరెక్టర్ అంజి రామ్ మాట్లాడుతూ ‘‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని, సుద్ధాల అశోక్ తేజగారు రాసిన ఈ పాటను మనోగారు అద్భుతంగా పాడారు ఈ పాట అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు. కార్తీక్ బి.కడగండ్ల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మురళీ మోహన్ సినిమాటోగ్రాఫర్.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!