NTR Fan : జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంపై ఇప్పటికే ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఎవరికైతే ఫోన్ చేశాడో.. ఆ ధనుంజయ నాయుడు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని. తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నా మీద 24 కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వార్-2 రిలీజ్ కు కొన్ని గంటల ముందు నాకు ఫోన్ చేశాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఎన్టీఆర్ తల్లిని దూషించినందుకే ఆ ఆడియో లీక్ చేశాను అంటూ తెలిపాడు ధనుంజయ.
Read Also : Vishwambhara : విశ్వంభర వాయిదా.. అనిల్ రావిపూడి ఫుల్ హ్యాపీ
ఎన్టీఆర్ తో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకు ఏమైనా విబేధాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఇలా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ అభిమానుల్లో నాకంటే పెద్ద వారు చాలా మంది ఉన్నారు. కానీ నాకే ఎందుకు ప్రత్యేకంగా చేశాడో అర్థం కావట్లేదు. ఈ విషయంపై నేను ఇప్పటికే పార్టీకి కంప్లయింట్ చేశాను. వారు పిలిస్తే వెళ్లి మాట్లాడుతాను. అమ్మ ఎవరికైనా అమ్మనే. ఎన్టీఆర్ తల్లిని తిట్టినందుకే ఆడియో బయట పెట్టాను. కచ్చితంగా ఎన్టీఆర్ కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. అంతే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేశాడు ధనుంజయ నాయుడు. తాను లోకేష్ కు దగ్గరిగా పనిచేశానని.. ఆ టైమ్ లో తనకు ఫోన్ చేయడం అంటే.. రేపు భవిష్యత్ లో తనకు ఏదైనా జరుగుతుందేమో అనే భయంతోనే బయట పెట్టినట్టు తెలిపాడు.
Read Also : Payal Rajput : బాబోయ్.. పాయల్ ను ఇలా చూస్తే అంతే
