NTR Fan : జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంపై ఇప్పటికే ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఎవరికైతే ఫోన్ చేశాడో.. ఆ ధనుంజయ నాయుడు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని. తెలుగు దేశం పార్టీలో…
Audio Leak:ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం లీక్ అయిన ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది.. అభిషేకాలు అమ్మకానికి పెట్టారు ట్రస్ట్ బోర్డులో ఓ మహిళా సభ్యురాలు.. పీఏతో బేరసారాలపై మాట్లాడిన ఆడియో అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్‌గా మారిపోయింది.. మల్లికార్జునస్వామికి అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో దోపిడీ చేయడమే ప్లాన్‌గా ఈ వ్యవహారం నడుస్తోంది.. స్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా.. గర్భాలయ అభిషేకాలు చేయిస్తామంటున్న ధర్మకర్తల మండలిలోని ఓ సభ్యురాలు ఆ ఆడియోలో…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఒక ఎంపీటీసీ సభ్యుడితో ఫోన్‌లో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ సభ్యులపైనా, నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ నాయకుడిపైనా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో లీక్ అయి సంచలనం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్…