Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. మనసులో ఏది ఉంటే దాన్నే నిర్మొహమాటంగా బయటపెట్టేస్తాడు. ఎవరు ఏమంటారు..? విమర్శలు వస్తాయి అని కూడా ఆలోచించడు. అది మంచి అయినా, చేదు అయినా.. స్టార్ హీరోల గురించి అయినా, సినిమాల గురించి అయినా తన అభిప్రాయాన్ని అభిమానాలతో పంచుకుంటూ ఉంటాడు. తమ్మారెడ్డి.. ఇలా తన అభిప్రాయాలను వ్యక్తపరిచి చాలా వివాదాలనే కొనితెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఆయన.. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆర్. నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం తన జీవితాన్ని మొత్తం సినిమాకు అంకితం చేశాడు. ప్రజల్లో మార్పు రావడం కోసం, రైతుల వ్యధలను కథలుగా మార్చి సినిమాలు తీసి పీపుల్స్ స్టార్ గా మారాడు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.
పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?
” తాను నమ్మిన సిద్ధాంతం కోసం అంత పెద్ద స్టార్ డమ్ ను వదిలేసిన ఏకైక నటుడు ఆర్. నారాయణ మూర్తి. తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేసిన వారిలో ఆర్ నారాయణ మూర్తి ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆయనకు నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ సిద్ధాంతాలు వదలకుండా సినిమాలు తీసే విధానాన్ని మార్చండి అని.. కానీ ఆయన ఏరోజు నా మాట విన్నాలేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితం మొత్తం అలాగే తన పంథాలోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. అలా కనుక చేస్తే ఇప్పుడు ఆయన ఎన్నో కోట్లు సంపాదించేవాడు. కానీ, అలా చేయకుండా ప్రస్తుతం రోడ్లపై కాలినడకనా లేదా ఆటో లో తిరుగుతూ ఉన్నాడు. ఆయన గొప్పతనం మరెవ్వరికీ రాదు. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన మనిషి ఇంకా అలానే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.