Ramya: డబ్బు, ఆశ… ఈ రెండు మనుషులను ఎంత దుర్మార్గులను అయినా చేస్తాయి. కన్నవారిని, కట్టుకున్నవారిని కూడా కడతేరుస్తాయి. అందుకు కామన్ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. ఒక సీరియల్ నటి.. తన భర్త .. సీరియల్స్ లో నటించొద్దు అని చెప్పాడని.. ప్రియుడితో కలిసి అతడిని హతమార్చాలని చూసింది. ఆమె పేరు రమ్య. తమిళ్ సీరియల్ నటి. సుందరి, కన్నెదిరే తోండ్రినాల్ లాంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్యకు కొన్నేళ్ల క్రితం రమేష్ తో వివాహమయ్యింది. కలతలు లేని వీరి కాపురంలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో రమేష్.. రమ్యను నటన మానేయమని చెప్పాడు. అందుకు ఆమె ససేమిరా అని చెప్పింది.. ఇలా గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే.. తన సహనటుడు చంద్రశేఖర్ ప్రేమలో పడింది రమ్య. అతడు.. రమేష్ ఉంటున్న ఇల్లును కొనాలని ప్రయత్నించాడు. రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పగా.. అందుకు రమేష్ ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ తమకు అడ్డుగా ఉన్న రమేష్ ను హతమార్చడానికి ప్లాన్ వేశారు.
Saindhav: వెంకీ మామ… బాంబ్ పేల్చడానికి రెడీ అయ్యాడు
రెండు రోజుల క్రితం రమ్య, రమేష్ బండిపై వెళ్తుండగా.. వెనుక నుంచి ఓక్ గుర్తుతెలియని వ్యక్తి తన బండితో రమేష్ బండిని ఢీకొట్టాడు. అనంతరం రమేష్ గొంతును బ్లేడ్ తో కోసి పరారయ్యాడు. వెంటనే రక్తపు మడుగులో ఉన్న రమేష్ ను హాస్పిటల్ చేర్పించగా బతికి బయటపడ్డాడు. ఇక తనపై హత్యాయత్నం జరిగిందని అతను పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు రమ్యను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పుకొచ్చింది. దీంతో ఆమెను అనుమానించిన పోలీసులు ఆమె ఫోన్ తీసుకొని చెక్ చేయగా.. చంద్రశేఖర్ తో కాల్స్ కనిపించాయి. అసలు విషయమేంటని ఇద్దరినీ తమదైన స్టైల్లో అడుగగా.. తానే తన భర్తను చంపాలనుకున్నట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.