సెప్టెంబర్ కల్లా బాక్సాఫీస్ వద్దకు చేరేందుకు ‘గుడ్డి’గా బయలుదేరుతోన్న ప్రశాంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మరి ఫిల్మ్ మేకర్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకే, చకచకా తమ షూటింగ్స్ ని చక్కబెట్టేస్తున్నారు చాలా మంది. తమిళ హీరో ప్రశాంత్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. తమిళ వర్షన్ లో ఆయన ఆయుష్మాన్ ఖురానా పోషించిన గుడ్డివాడి పాత్ర చేస్తున్నాడు. అందుకే, సినిమా టైటిల్ ‘అందగన్’ అని పెట్టారు. ఇక బాలీవుడ్ లో టబు చేసిన రోల్ కోలీవుడ్ లో సిమ్రాన్ చేస్తోంది. ‘అందగన్’ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
జూలై 28తో లోకల్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘అందగన్’ యూనిట్ ఆగస్ట్ మధ్యలో ఫారిన్ లోకేషన్స్ కు వెళ్లనుంది. ఆ ఓవర్ సీస్ షెడ్యూల్ కూడా కంప్లీటైతే ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ తో పాటూ సమాంతరంగా ఎడిటింగ్ కానిచ్చేస్తోన్న సినిమా దర్శకనిర్మాతలు ప్రశాంత్, సిమ్రాన్ స్టారర్ ని సెప్టెంబర్ లో థియేటర్స్ కు తీసుకురానున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ రిలీజ్ కి కౌంట్ డౌన్ మాత్రం మొదలైపోయింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘అంధాధున్’ తెలుగులోనూ రీమేక్ అవుతోంది. నితిన్, తమన్నా ప్రధాన పాత్రల్లో బ్లాక్ కామెడి క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతోంది. టాలీవుడ్ వర్షన్ కంటే ముందుగానే కోలీవుడ్ వర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూడాలి మరి, హిందీ తెరపై దక్కిన విజయమే దక్షిణాదిలోనూ దక్కుతుందో లేదో…
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?