మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి బ్రాండ్ అంబాసిడర్ మిల్కీ బ్యూటీ.. పాల నురుగుల మేనిమ ఛాయ.. కలువ లాంటి కళ్లు.. ముఖ్యంగా కుర్రాళ్లకు మతిపోగోట్టే నడుము ఆమె సొంతం. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కి సై అంటుంది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో అభిమానులకు పిచ్చేక్కించేస్తోంది. అయితే ఇటీవల అమ్మడు పింక్ కలర్ డ్రెస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫొటోలో తమ్మూ బేబీ ని చుసిన వారందరు.. తమన్నా ఏంటి ఇలా మారిపోయింది అన్న డౌట్ రాక మానదు. అమ్మడిలో మునుపటి లుక్ లేదు అన్నది అభిమానుల మాట.
కరోనా సెకండ్ వేవ్ లో మిల్కీ బ్యూటీ కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో తమన్నా లుక్ మొత్తం మారిపోయింది. పూర్తిగా బొద్దుగా మారిపోయి కనిపిచింది. ఆ తరువాత గట్టిగా వర్క్ అవుట్స్ చేసి మునుపటి రూపానికి వచ్చేసింది కానీ ఆ ఫేస్ లో మునుపటి అందం మిస్ అయ్యింది అని అంటున్నారు అభిమానులు. కరోనా ప్రభావం అమ్మడిపై బాగా పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలలో తమన్నా శరీర సౌష్ఠవంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖంలో నిద్రలేనితనం, అలసట, థైస్ ఎలివేట్ చేయాలని చూసినా కూడా అంతగా ఏమి ఎలివేట్ కాలేదని తెలుస్తోంది. మొత్తంగా తమన్నా లో టాప్ టూ బాటమ్ చాలా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు అమ్మడు మునుపటి రూపాన్ని సంతరించుకొంటుందో ? లేదో చూడాలి.