Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు రోజురోజుకు ఎక్కువపోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆమె బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని, పెద్దలు కుదిర్చిన వివాహం అని, అతడికి వింత వ్యాధి కూడా ఉందని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక నిన్నటివరకు ఈ వార్తలను పట్టించుకోని తమ్ము బేబీ.. ఇక ఈ వార్తలను ఆపకపోతే కష్టమా అనుకున్నదో ఏమో ఎట్టకేలకు తన భర్తను పరిచయం చేస్తూ పోస్ట్ పెట్టింది. నా భర్త అంటూ తమన్నా పోస్ట్ చేసిన అతనిని చూశాకా నెటిజన్లు ఖంగుతిన్నారు. ఏంటి తమ్ము మరీ ఇంతలా సెటైర్ వెయ్యాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
భర్త ఫోటో చూపిస్తే సెటైర్ అంటారేంటి అని అనుకుంటున్నారా.. అవును తన పెళ్లి వార్తలను ఖండిస్తూ అమ్మడు తాను మగాడి గెటప్ లో ఉన్న ఫోటోను పెడితే షాక్ అవ్వరా ఏంటి..?. పెళ్లి వార్తలో నిజం లేదని అమ్మడు ఈ రేంజ్ లో కౌంటర్ వేసింది అన్నమాట. ఎఫ్ 3 లో తమన్నా కొద్దిసేపు మగాడిలా కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇతడే నా భర్త అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇంకా తన జీవితంలో ఎవరు రాలేదని చెప్పకనే చెప్పింది. ఇంకేముంది పుకార్లు పుట్టించినవారు ఎంచక్కా నోరు ఎత్తకుండా కూర్చుండిపోయారు. ఇక ప్రస్తుతం తమన్నా కెరీర్ విషయానికొస్తే భోళా శంకర్ సినిమాలో చిరు సరసన నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ఇంకో రెండు సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.