Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో తమ్ము పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. ఇక జైలర్ హిట్ కావడంతో తమన్నా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో భోళా శంకర్ పోయినా.. అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే తమన్నా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టింది. రజినీకాంత్ తో నటించడం తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగాలని అనుకునేదాన్ని.. అది అస్సలు జరిగిద్దా..? లేదా ..? అనుకునేదాన్ని.. కానీ, జైలర్ లో ఆయనతో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించే ఛాన్స్ ఇచ్చినందుకు నెల్సన్ కు థాంక్స్ చెప్పింది. ఇక తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు తమన్నా చెప్పింది.
Natural Star Nani: నాకు తెలిసిన హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అంటే అతనే..
” నేను నా కెరీర్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఇప్పటికి బాధపడుతూ ఉంటాను. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసిన ప్రతిసారి చాలా బాధపడతాను. ఎందుకంటే ఆ సినిమా నాకు ఎంతగానో నచ్చింది. మొదట ఆ కథ నా దగ్గరకే వచ్చింది. కానీ, అప్పట్లో చేతినిండా సినిమాలు ఉండడంతో నేను ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. అయితే సినిమా చూశాక మాత్రం ఏదొక విధంగా టైమ్ ఇచ్చి ఉంటే బావుండేది అని అనిపించింది. ఆ సినిమా మిస్ అయ్యినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను” అని చెప్పుకొచ్చింది. అయితే ఆఫర్ వచ్చింది అని చెప్పింది కానీ, కాజల్ పాత్రకా .. తాప్సీ పాత్రకా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఏదిఏమైనా తమన్నా ఒక మంచి హిట్ సినిమాను మాత్రం మిస్ చేసుకుంది అనేది వాస్తవం. మరి ముందు ముందు మిల్కీ బ్యూటీ ఎలాంటి అవకాశాలు అందుకోనున్నదో చూడాలి.