Tamannah: తమన్నాకు పిల్లలంటే భయం.. కారణం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannah Bhatia Fear on Having Kids: నటి తమన్నా భాటియా స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ఈ మధ్యనే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరోసారి తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. తమన్నాకు పిల్లలంటే భయం అట. తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లల గురించి ఎందుకు భయపడుతున్నానో చెప్పింది. ఒక పాడ్‌కాస్ట్‌లో తమన్నా భాటియా మాట్లాడుతూ, నేను తల్లి కావడానికి భయపడుతున్నాను. తల్లులు తమ సర్వస్వం తమ పిల్లలకు అందజేస్తారు. నేను పిల్లలకు అంత ప్రేమ, సంరక్షణ – శ్రద్ధ ఇవ్వలేను. నా తల్లిదండ్రులు నాకు ఎనలేని ప్రేమను ఇచ్చారు. వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే.. పేరెంటింగ్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదంతా నేను చేయలేనని అనుకుంటున్నాను.
Sukumar- Dil Raju: నేనున్నా.. దిల్ రాజుకు సుక్కూ అభయం!
Also Read
పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది’’ అని తమన్నా భాటియా అన్నారు. ఈ భయం చూస్తుంటే అసలు తమన్నాకి భవిష్యత్తులో పెళ్లవుతుందా? పిల్లలు పుడతారా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. ఇక అదే ఇంటర్వ్యూలో తమన్నా భాటియా మరిన్ని విషయాల గురించి మాట్లాడింది. వీడియో గేమ్‌లు ఆడేందుకు ఇష్టపడే తమన్నా స్కూల్‌లో నిజాయితీ గల అమ్మాయిగా ఉండేదట. చుట్టుపక్కల వారు ఏం చెప్పినా తమన్నా పట్టించుకోదని, మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని, స్త్రీ ఏదైనా చేయగలదని తన నమ్మకం అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక రిలేషన్ షిప్ బాగుండాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు తమన్నా సమాధానమిస్తూ మీ భాగస్వామి చెప్పేవి ప్రశాంతంగా వినండి. దీనివల్ల ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుని ధైర్యం నింపుతారన్నారు. నేను మీతో ఉన్నాను, మీ పోరాటంలో నేను పాల్గొంటున్నాను, మీరు ఏమి చేసినా నేను మీకు అండగా ఉంటాను అని పార్ట్నర్ కి భరోసా కల్పించాలని తమన్నా భాటియా చెప్పింది. మరోపక్క తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది. ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నా వాళ్ళు అధికారికంగా చెబితే తప్ప నమ్మలేం.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!