ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసీగా కథలు ఎంచుకునే ధనుష్, నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకూ తన ప్రయాణాన్ని తీసుకోని వెళ్తున్న ధనుష్… మరో హిందీ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా తనకి సాలిడ్ డెబ్యూ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో కావడం విశేషం. ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ కలిసి చేసిన ‘రాంజనా’ సినిమా రిలీజ్ అయ్యి దశాబ్దం అయ్యింది. రాంజనా సినిమా ధనుష్ కి బాలీవుడ్ లో సాలిడ్ డెబ్యూ ఇచ్చింది.
2021లో వచ్చిన ‘అత్రంగీ రే’ సినిమా కూడా ధనుష్ హిట్ లిస్టులో చేరింది. రాంజనా, అత్రంగీ రే సినిమాలతో రెండు హిట్స్ కొట్టిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఒక ప్యూర్ లవ్ స్టోరీతో పాటు కాస్త యాక్షన్ కూడా మిక్స్ అయిన కథతో సినిమా చేయనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందట. అయితే పదేళ్ల క్రితం ధనుష్ వేరు ఇప్పుడు ధనుష్ వేరు. మార్కెట్ విషయంలో ధనుష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది, ఇలాంటి సమయంలో ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి చేయనున్న సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తారా లేక హిందీకి మాత్రమే పరిమితం చేస్తారా అనేది చూడాలి.