టాలీవుడ్‌లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్ మెంట్ పాస్ చేసి బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను.. అక్కడ లేడీ ఓరియెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టేసి.. సెటిలైంది. అప్పుడప్పుడు ఒకటి అరా చిత్రాలతో తమిళ్, తెలుగులో సందడి చేస్తోంది కానీ టాప్ హీరోలు ఆమెకు ఛాన్సులివ్వడం లేదు. తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే ఫిల్మ్ తర్వాత టోటల్లీ నార్త్ బెల్ట్ పైనే ఫోకస్ చేసింది సొట్టబుగ్గల సుందరి.
Also Read : Sreleela : ఈ ఏడాది ఒక్క హిట్ కూడా కొట్టని శ్రీలీల.. కారణం ఏంటి?
డంకీలో షారూక్‌తో నటించాక కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని ఊహించుకుంది కానీ ఆ తర్వాతే డల్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఖేల్ ఖేల్ మే తర్వాత కనిపించని తాప్సీ.. 2024లో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథిమాస్ బోను సెలెంటుగా వివాహం చేసుకుని మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరయ్యింది. ఈ విషయం కూడా గుమ్మనంగా మెయిన్ టైన్ చేసింది. అవసరమైతే తప్ప హస్బెండ్ టాపిక్ తీసుకురాదు. అయితే రీసెంట్లీ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చిక్కుల్లో పడేలా చేసింది. స్వదేశాన్ని వీడి.. విదేశాలకు తాప్సీ పన్ను చెక్కేసిందంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ తాప్సీ పన్ను చెవికి చేరాయి. దీంతో ఈ ఫైర్ బ్రాండ్.. న్యూస్ స్ప్రెడ్ చేసిన న్యూస్ ఛానల్‌పై మండిపడింది. తప్పుడు కథనాలు ఎలా సృష్టిస్తారంటూ ఫైర్ అయ్యింది. అలాగే ముంబయిలోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి. ప్రజెంట్ ఆమె చేతిలో త్రీ ప్రాజెక్ట్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. గాంధారీతో పాటు వో లడఖీ హై కహా, ముల్క్2లో నటిస్తుంది. ఈ ఏడాది థియేటర్ అండ్ ఓటీటీ ప్రేక్షకులను మిస్ చేసిన తాప్సీ.. నెక్ట్స్ ఇయర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదని ఈ లైనప్ చూస్తేనే అర్థమౌతోంది.