Nikhil: కుర్ర హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా నిరాశపరిచిందని, తరువాతి సినిమా నిరాశపరచకుండా చూసుకుంటాను అని నిఖిల్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం తెల్సిందే. ఇక అభిమానులకు ఇచ్చిన మాట కోసం నిఖిల్ తన తరువాతి సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో నిఖిల్ కెరీర్ లో మొట్టమొదటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ అండ్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది.
Keerthy Suresh: డైరెక్టర్ భార్యతో మహానటి డ్యాన్స్.. చివర్లో అతని ఎంట్రీ..
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిఖిల్ ఈ సినిమా కోసం వియాత్నంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఫోటోను నిఖిల్ షేర్ చేస్తూ కత్తి యుద్ధాలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా టార్గెట్ కోసం కష్టపడుతున్నాను.. స్వయంభు ట్రైనింగ్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్టర్లో నిఖిల్ చెమటోడుస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.