Site icon NTV Telugu

Thammudu : మా అమ్మ ముందే సిగరెట్ తాగాను.. నటి షాకింగ్ కామెంట్స్..

Swasika

Swasika

Thammudu : అమ్మ ముందే రోజూ సిగరెట్ తాగానని క్రేజీ యాక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న స్వసిక విజయ్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయ్, సీనియర్ హీరోయిన్ లయ కలిసి లంచ్ చేస్తూ మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. ఇందులో స్వసిక విజయ్ మాట్లాడుతూ.. సినిమాలో తన పాత్ర సిగరెట్ తాగాల్సి ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో ప్రాక్టీస్ చేసినట్టు తెలిపింది.

Read Also : Star Heroines : ఆ పని అస్సలు చేయని ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!

ఈ సినిమాకు ముందు నాకు అసలు సిగరెట్ తాగడమే అలవాటు లేదు. పాత్ర కోసం రోజూ మా అమ్మ ముందే ఇంట్లో సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేశాను. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించింది. మా అమ్మ ముందే అలా సిగరెట్ కాల్చడం అస్సలు నచ్చలేదు. కానీ నా పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సిగరెట్ తాగాను. అది సినిమాలో బాగా వచ్చింది. డైరెక్టర్ గారు తాగమన్నారని మా అమ్మకు చెప్పడంతో ఆమె ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. చివరకు సినిమాలో అది వర్కౌట్ అయింది. మూవీలో నా రోల్ ను చూసి నాకే షాకింగ్ గా అనిపించింది అంటూ తెలిపింది స్వసిక. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీలో నితిన్ తో పాటు ఫీమే క్యారెక్టర్లకు మంచి ప్రాధాన్యత ఉందని ఇప్పటికే డైరెక్టర్ స్పష్టం చేశారు. మరి రేపు థియేటర్లలో ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి.

Read Also : Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..

Exit mobile version