Suriya 41 : సరికొత్తగా సూర్య-బాలా ప్రాజెక్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ బాలాతో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవడంతో.. ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారు.. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గా కన్యాకుమారిలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కథ పై.. ఇప్పుడో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం సముద్రం నేపథ్యంలోనే నడుస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో సూర్య పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. దాంతో సూర్య, బాలా మరో ప్రయోగం చేస్తున్నారనే చెప్పొచ్చు. సూర్య కెరీర్లో 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై.. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఒక కథానాయికగా క్యూట్ బ్యూటీ కృతి శెట్టిని ఫైనల్ చేశారు. అలాగే మరో హీరోయిన్‌గా టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే.. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. రీసెంట్‌గా వచ్చిన ‘ఈటీ’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో బాలా ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే బాలాకి విలక్షణ దర్శకుడిగా పేరు ఉంది. దాంతో ఈ సినిమా కమర్షియల్ పరంగానే కాదు.. అవార్డుల పంట కూడా పండిస్తుందని అంటున్నారు. ఇక ఆ తరువాత సుధా కొంగరతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. అలాగే మరో టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇలా భారీ లైనప్‌తో వైవిధ్యంగా.. ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. మరి సముద్రపు బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న బాలా-సూర్య సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
- IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
తాజావార్తలు
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!