కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఓ ప్రాజెక్ట్‌కు కమిటవ్వడం ఎనౌన్స్ జరిగాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధ్రువ నక్షత్రం. 2013లోనే స్టార్టైన ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్.. హీరో సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు. తర్వాత విక్రమ్‌తో కంప్లీట్ చేశాడు. కానీ సూర్య చేయలేదన్న కోపం గౌతమ్‌లో అలానే కంటిన్యూ అవుతోంది.
Also Read : VIJAY 63 : విజయ్ ‘జననాయగన్’ గ్లింప్స్ డేట్ ఫిక్స్
సూర్య కెరీర్ లో పితామగన్, నంద వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ బాలా. ఈ డైరెక్టర్ చేసిన వనంగాన్ ఫస్ట్ చాయిస్ సూర్యనే. కానీ స్క్రిప్ట్‌లో ఛేంజస్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. సూర్య ప్లేసులో అరుణ్ విజయ్‌తో సినిమా చేసాడు బాలా. ఇక సూరారై పొట్రుతో సూర్యకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సుధా కొంగరతో పూరాణనూర్ ప్రాజెక్టుకు కమిటయ్యాడు.. ఎనౌన్స్ మెంట్ కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే పరాశక్తిగా శివకార్తీకేయన్‌తో తెరకెక్కిస్తోంది సుధా. ఇప్పుడు ఈ జాబితాలోకి వెట్రిమారన్ చేరినట్లు టాక్. సూర్య- వెట్రి కాంబోలో వాడివాసల్ చేస్తున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. కానీ మూడేళ్లుగా వెట్రి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేయకపోవడం.. సూర్యకు ఉన్న అదర్ కమిట్మెంట్స్ వల్ల సినిమాను ఆపేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు కొత్త కాన్సెప్టుతో శింబుని లైన్లో పెట్టాడట వెట్రి. ఇలా వరుసగా స్టార్ దర్శకులకు హ్యాండిచ్చాడు హీరో. పోనీ ఈ సినిమాలు కాదని మంచి సినిమాలు చేశాడా అంటే అది లేదు. కంగువ, రెట్రో వంటి డిజాస్టర్ సినిమాలు చేసాడు సూర్య.