కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఓ ప్రాజెక్ట్‌కు కమిటవ్వడం ఎనౌన్స్ జరిగాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధ్రువ నక్షత్రం. 2013లోనే స్టార్టైన ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్.. హీరో సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు. తర్వాత విక్రమ్‌తో కంప్లీట్ చేశాడు. కానీ సూర్య చేయలేదన్న కోపం గౌతమ్‌లో…
సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాఘవన్, ఏం మాయ చేసావే, ఎంత వాడు గానీ, కాక్క కాకా లాంటి సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. మణిరత్నం తర్వాత అంత పొయిటిక్ గా ప్రేమని ప్రెజెంట్ చేయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్, స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా కూడా మారి అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటాడు.…