ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చాక్లెట్ బాయ్‌గా నిలిచిపోయిన నటుడు ఆర్. మాధవన్. యూత్‌లో ఆయన హైర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకు అందరూ కాపీ కట్టేవారు. ముఖ్యంగా మాధవన్ నవ్వుకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ప్రజంట్ హీరోగా కాకుండా మంచి క్యారెక్టర్ లు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మాధవన్ రెండు హిందీ సినిమాలు చేస్తుండగా, మరో తమిళ చిత్రం ‘అదృష్టశాలి’లో కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో మాధవన్ తక మాటలు తరచూ వార్తల్లో నిలుస్తునే ఉన్నారు.. ఇందులో భాగంగా తాజాగా ఇప్పుడు తన వయసు గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు.
Also Read : Janhvi Kapoor: ‘భారత్ మాతాకీ జై’ వివాదం పై.. కౌంటర్ ఇచ్చిన జాన్వీ
‘‘మన పిల్లల స్నేహితులు మనల్ని అంకుల్ అని పిలిచినప్పుడు నిజంగా వయసు గుర్తుకొస్తుంది. మొదట్లో ఆశ్చర్యం కలుగుతుంది, కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. కానీ చివరికి ఆ పదాన్ని అంగీకరించాల్సిందే. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల్లో మన జంటగా నటించే హీరోయిన్‌ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. లేకపోతే అదే ప్రజలకు ప్రధాన చర్చనీయాంశం అవుతుంది. నేను ఎలా కనిపిస్తున్నా.. నా సినిమాల ఎంపికలో వయసుకు తగ్గ అంశాలను దృష్టిలో ఉంచుకుంటున్నాను’’ అని చెప్పారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.