Surekha – Chiranjeevi : నాకు దోశలు వేయడం నేర్పించింది ఆయనే
- హైటెక్స్‌లో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్
- చిరు–సురేఖ సరదా ముచ్చట్లు హైలైట్
- “దోశలు నేర్పింది ఆయనే”.. సురేఖ కామెంట్ వైరల్
- సినీ, రాజకీయ ప్రముఖులతో వేడుకకు వన్నె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surekha – Chiranjeevi : నగరంలోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవార్డుల ప్రదానోత్సవం మధ్యలో యాంకర్ సుమ, చిరు దంపతులతో జరిపిన సరదా ముచ్చట్లు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
సోషల్ మీడియాలో చిరంజీవి అప్పుడప్పుడు ‘చిరు లీక్స్’ పేరుతో సినిమా లీక్స్ షేర్ చేస్తుంటారు. దీనిపై సుమ స్పందిస్తూ.. “సర్ సినిమాల గురించి లీకులు ఇస్తుంటారు, మరి మేడం కిచెన్ లీక్స్ ఏమైనా ఇస్తారా?” అని ప్రశ్నించారు. దీనికి సురేఖ నవ్వుతూ స్పందిస్తూ, ఇంట్లో దోశలు వేసే బాధ్యత (డిపార్ట్‌మెంట్) పూర్తిగా చిరంజీవి గారిదేనని వెల్లడించారు. “ఆయన దోశలు వేయడం కేవలం వీడియోల కోసం కాదు, అది ఆయనకున్న ఓన్ టాలెంట్. నిజానికి నాకు దోశలు వేయడం నేర్పించింది కూడా ఆయనే” అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
Also Read
- Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
- Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
- Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
- Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
సురేఖ మాటలకు చిరంజీవి కూడా తనదైన శైలిలో చమత్కరించారు. “రోజు నేనే దోశలు వేస్తున్నానని అందరూ నిజం అనుకుంటారు.. ఊరుకో” అంటూ నవ్వుతూ వారించారు. అంతకుముందు ఉగాది వంటల గురించి ప్రస్తావిస్తూ.. పండుగ అంటేనే పులిహోర కదా, ఖచ్చితంగా ఇంట్లో వెరైటీలు చేసుకున్నామని సురేఖ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ దంపతులతో పాటు కింగ్ నాగార్జున, కొత్త జంట నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల కూడా సందడి చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు విజేతలకు అవార్డులు అందజేశారు. ఒకవైపు గద్దర్ స్మారక అవార్డుల భావోద్వేగ వాతావరణం, మరోవైపు సినీ తారల సందడితో హైటెక్స్ ప్రాంగణం మిరుమిట్లు గొలిపింది.
తాజావార్తలు
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!