Supriya Menon Comments On Salaar Movie: ‘సలార్’ సినిమా మీద ఎన్ని భారీ అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆల్రెడీ తమతమ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తమదైన ముద్ర వేసిన ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్), ప్రభాస్ (బాహుబలి) కాంబోలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది కాబట్టి.. కచ్ఛితంగా ఇది ఇండియన్ రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఆ అంచనాలు రెట్టింపయ్యేలా తాజాగా ఓ స్టార్ హీరో భార్య ఈ చిత్రంపై కామెంట్స్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోవడం ఖాయమని ఆమె పేర్కొంది. ఇంతకీ.. ఆమె ఎవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మీనన్.
సలార్ సినిమాలో పృథ్వీరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అతని భార్య సుప్రియ ‘సలార్’ సెట్స్‌కి విచ్చేసింది. శనివారం సెట్స్‌లో ప్రశాంత్‌తో కలిసి ఒక ఫోటో కూడా దిగింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ‘‘సలార్ సెట్స్‌కి విచ్చేసే సువర్ణవకాశం నాకు దక్కింది. ప్రశాంత్ నీల్ సార్.. మీరు సొంత లీగ్‌లో తీస్తోన్న ఈ సినిమా కచ్ఛితంగా అన్ని రికార్డులను బద్దలుకొడుతుంది. మీ విజన్‌ను వెండితెరపై ఊహించుకుంటుంటేనే రొమాలు నిక్కబొడిచేసుకుంటున్నాయి. మీ సినిమా సెట్స్‌కి విచ్చేయడం సంతోషంగా ఉంది’’ అంటూ సుప్రియ ఇన్స్టాగ్రామ్ మాధ్యమంగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఈ సినిమాతో తమ అభిమాన హీరో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా రికార్డుల పరంగా సరికొత్త బెంచ్మార్కుల్ని సృష్టిస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదివరకే అతనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అవ్వగా, దానికి విస్తృతస్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే సలార్‌ని కూడా రెండు భాగాల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.