సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా క్లాస్ మిక్స్డ్ విత్ లైట్ మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉండడంతో ఫాన్స్ అన్ని సినిమాలని క్లాస్ మూవీస్ కిందే లెక్కేశారు. ఎంత క్లాస్ సినిమాలు చేసినా, చొక్కా నలగకుండా ఫైట్స్ చేసినా ఫాన్స్ మహేష్ నుంచి ఒక పోకిరి పండుగాడిని, ఒక బిజినెస్ మాన్ సూర్య భాయ్ ని, ఒక ఒక్కడు అజయ్ ని, ఖలేజా సీతా రామరాజుని, అతడు నందుని కోసం వెయిట్ చూస్తూ ఉంటారు. ఆ లోటు తీర్చడానికి, ఘట్టమనేని అభిమానుల ఆకలిని ఎండ్ కార్డు వేయడానికి మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసాడు. ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలకి కల్ట్ స్టేటస్ ఉంది. ఈసారి మాత్రం మూడో సినిమాకి ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మహేష్ అండ్ త్రివిక్రమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ పై SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీకి టైటిల్ ని అనౌన్స్ చెయ్యడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు.
మే 31న కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28 టైటిల్ ని ‘గుంటూరు కారం’గా అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకి రానుంది. చాలా రోజులుగా ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ‘SSMB 28’ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక అప్డేట్ కూడా బయటకి వచ్చేస్తుంది కాబట్టి మహేష్ ఫాన్స్ మరింత అలర్ట్ గా ఉంటే ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ఈ సినిమాకి టైటిల్ దాదాపుగా ‘గుంటూరు కారం’గానే ఫిక్స్ అయినట్లు సమాచారం. టైటిల్ ఏదైనా మాస్ మాత్రం మిస్ అవ్వకుండా మహేష్-త్రివిక్రమ్ ఒక సాలిడ్ సినిమా ఇచ్చేస్తే ఆ తర్వాత పని ఫాన్స్ చూసుకుంటారు.