Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Super Star Mahesh Babu Launched Prema Vimanam Teaser

Mahesh Babu: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ లాంచ్ చేసిన ‘ప్రేమ విమానం’ టీజర్…

Published Date :April 27, 2023 , 12:18 pm
By Shiva Kranthi
Mahesh Babu: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ లాంచ్ చేసిన ‘ప్రేమ విమానం’ టీజర్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూప‌ర్ స్టార్ మ‌హేష్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభ‌న్‌, శాన్వి మేఘ‌న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అన‌సూయ‌, వెన్నెల కిషోర్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఓ ప‌ల్లెటూరులోని ఇద్ద‌రు పిల్ల‌లు వారికి ద‌గ్గ‌ర‌గా ఉండే కొండ‌నెక్కి విమానాన్ని చూస్తుంటారు. అందులో ఓ పిల్లాడు మ‌రో పిల్లాడితో ‘అరే మ‌నం కూడా విమానంలో పోదాం రా’ అంటాడు. వారిద్దరూ విమానాన్ని చూడగానే సంతోషపడుతుంటారు. అసలు విమానం అంత ఎత్తు ఎలా ఎగురుతుందనే సందేహం కూడా వారిలో ఉంటుంది. అదొక్కటే కాదు.. విమానానికి సంబంధించి వారికి చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ వారి గూడెంలోని వ్యక్తి (వెన్నెల కిషోర్)ని అడుగుతుంటారు. పిల్లల సందేహాలు తీర్చలేక అతని తల ప్రాణం తోకకొస్తుంటుంది. ‘విమానం కనిపెట్టిన రైట్స్ బ్రదర్స్‌కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకుని’ అని అసహనం వ్యక్తం చేస్తుంటాడు.

మరో వైపు ఓ ప్రేమ జంట (సంగీత్ శోభన్, శాన్వి మేఘన) సంతోషంగా ఉంటారు. అబ్బాయి, అమ్మాయి మధ్యలో మనస్పర్దలు, వాటికి కారణం ఏంటి? వారి ప్రేమ‌ని ఊరు అంగీక‌రిస్తుందా? చివ‌ర‌కు వారు విమానం ఎక్కి ఎందుకు పారిపోవాల‌ని అనుకుంటుంటారు. వీరంద‌రూ ఒక‌చోట చేరిన‌ప్పుడు ఏం జ‌రుగుతుంది. అస‌లు విమానానికి వీరి జీవితాల‌కు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒక వైపు ప్రేమ‌లోని మాధుర్యం, తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే పిల్ల‌ల అమాయ‌క‌త్వం వ‌ల్ల వ‌చ్చే ఫ‌న్‌, ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే స‌న్నివేశాలు ఇవ‌న్నీ ప్రేమ విమానంలో మిళిత‌మై ఉన్నాయ‌ని టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. బలమైన ఎమోషన్స్, చేజింగ్ సన్నివేశాల కలయికగా ఈ వెబ్ ఒరిజినల్‌ను సంతోష్ కటా తెర‌కెక్కించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి తర్వాత హీరో సంగీత్ శోభన్ నటిస్తోన్న భారీ చిత్రం ‘ప్రేమ విమానం’. అలాగే నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్, అనిరుధ్ తొలిసారి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన తొలి వెబ్ ఒరిజినల్ కూడా ఇదేకావటం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mahesh Babu Prema Vimanam
  • Prema Vimanam
  • Prema Vimanam Teaser
  • Sangeeth Shoban Prema Vimanam

తాజావార్తలు

  • Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions