God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
- ఎన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’పై తొలిసారి స్పందించిన త్రివిక్రమ్
- మైథలాజికల్ జానర్లో తొలిసారి అడుగుపెడుతున్న త్రివిక్రమ్
- సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా భారీ ప్రాజెక్ట్
- సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయినట్లు వెల్లడి
- పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram Srinivas God of War: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ పై తొలిసారి ఆయన బహిరంగంగా స్పందించారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన కీలక అప్డేట్స్ను పంచుకుంటూ తారక్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు.
ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు త్రివిక్రమ్.. తొలిసారిగా మైథలాజికల్ జానర్లోకి అడుగుపెడుతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్‌తో కలిసి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనిపై ఎక్కడా పెదవి విప్పని త్రివిక్రమ్, తాజాగా ఒక టాక్ షోలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అసలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌పై కనిపించిన ‘నా జానామి శబ్దం న జానామి చార్థం’ అనే సంస్కృత శ్లోకం గురించి ప్రస్తావిస్తూ త్రివిక్రమ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆరు ముఖాల షణ్ముఖుడి దివ్య రూపం తన హృదయంలో మెదలగానే మాటలు, స్తోత్రాలు వాటంతట అవే కవిత్వంలా ప్రవహించాయని.. ఈ ప్రాజెక్ట్ వెనుక దైవ సంకల్పం ఉందని గురూజీ వివరించారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఘన విజయం సాధించడంతో.. ఇప్పుడు ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ విడుదల కాగానే పూర్తిగా ‘గాడ్ ఆఫ్ వార్’ పనుల్లోకి దిగుతానని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. వచ్చే వేసవి నాటికి ఆ చిత్రాన్ని పూర్తి చేసి, వెంటనే ప్రత్యేకమైన మేకోవర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
తాజావార్తలు
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
-
itel VistaTab 32: ఐటెల్ VistaTab 32 టాబ్లెట్ లాంచ్.. 8200mAh బ్యాటరీ, 11 ఇంచెస్ డిస్ప్లే, 8MP కెమెరా ఫీచర్లు ఇవే!
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!