రీజనల్ సినిమాలతో కనీవినీ రికార్డులు క్రియేట్ చేయడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే సాధ్యమని చెప్పొచ్చు. ఒక్కడు, పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇంకా మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. కానీ మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ మాత్రం పాన్ ఇండియా హీరోల రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు మహేష్. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Read Also: Charan-NTR: చరణ్ కూతురుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్?
ముందుగా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేసిన ఫైనల్‌గా రీజనల్ సినిమాగానే రాబోతోంది గుంటూరు కారం. అయినా ఈ సినిమాకు మహేష్ భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ‘గుంటూరు కారం’ కోసం మహేష్ బాబు దాదాపు 70 నుంచి 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు కానీ ఓ రీజనల్ సినిమా కోసం మహేష్‌కు.. ఈరేంజ్ రెమ్యూనరేషన్ అంటే, మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు పారితోషికం ఏ రేంజ్లో ఉంటుంటో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా రీజనల్ సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేయడంలో మహేష్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు.