రీజనల్ సినిమాలతో కనీవినీ రికార్డులు క్రియేట్ చేయడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే సాధ్యమని చెప్పొచ్చు. ఒక్కడు, పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇంకా మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టలేదు. కానీ మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ మాత్రం పాన్ ఇండియా హీరోల రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు…