సన్నీ లియోన్ అంటే తెలియని వారు ఉండరు. ఆ అమ్ముడు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆమె ముందు ఉంటారు. అడల్ట్ సినిమాలు తీసినా, అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ఆమె మనసు మాత్రం ఎలాంటి మలినం లేనిదని చెప్పాలి. అయితే సన్నీ లియోనీ ముగ్గురు పిల్లల తల్లి అనే విషయం తెలిసిందే. కానీ వారిలో ఒక్కరిని కూడా ఆమె జన్మ నివ్వలేదు. ఒకరు దత్తత ద్వారా, మరో ఇద్దరు సరోగసీ ద్వారా పుట్టారు. అయితే సన్నీ ఇటీవల ఓ షోలో తన సరోగసీ,దత్తత ప్రయాణం గురించి నిజాయితీగా మాట్లాడారు. ఈ ప్రాసెస్‌లో ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలు, మరియు ఫైనాన్షియల్ అంశాలను బయట పెట్టారు.
Also Read : Niharika : బాధ, ఆశ, సంతోషం.. నిహారిక కొణిదెల ఎమోషనల్ జర్నీ
“నేను ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకున్నాను. మేము అడాప్షన్ కోసం అప్లై చేసిన వెంటనే, ఐవీఎఫ్ రోజునే ఒక బిడ్డతో మ్యాచ్ అయ్యాయి అలా ఆ పాపను తీసుకున్నాం. ప్రెగ్నెన్సీని నేను ఇష్టపడలేదు అందుకే సరోగసీ వైపు అడుగులు వేశాము. కానీ నాకు చాలా ఖర్చు అయింది. మేము వీక్లీ ఫీజులు చెల్లించాము. సరోగసీ మదర్ భర్త కూడా డ్యూటీ కి వెళ్ళకుండా ఉండటానికి డబ్బులు ఇచ్చాము. మేము ఇచ్చిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కుంది.’ అని తెలిపింది.సరోగసీ కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, ఒక ప్రేమతో కూడిన, భావోద్వేగపూరిత నిర్ణయం అని సన్నీ తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.